జమ్మూ కశ్మీర్లో గత రెండు రోజులుగా భారీగా మంచు కురుస్తోంది. కశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్మార్గ్ను మంచు పూర్తిగా కప్పేసింది. దీంతో పర్యాటకులు ఈ మంచులో ఎంజాయ్ చేస్తూ కశ్మీర్లో శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల కోసం పెద్ద ఎత్తున ప్రజలు ఆయా ప్రాంతాలు పర్యాటకులతో సందడిగా మారాయి.