కాకినాడ కేంద్రంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ నెల 28,29,30 తేదీ ల్లో మూడు రోజులపాటు కాకినాడలో మకాం వేయనున్నారు. కాకినాడ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఏ నియోజకవర్గంలో పార్టీ పోటీ చేస్తుందనే దానిపై సమీక్ష తర్వాత స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ రోజు సాయంత్రంలోగా పర్యటన షెడ్యూల్ ఖరారు కానుంది. కాకినాడపైగా దృష్టి పెట్టి పవన్ మూడు రోజుల సమీక్ష నిర్వహిస్తుండడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.