విజయనగరం జిల్లా, గజరాయనివలస గ్రామానికి చెందిన నడి మింటి పెదసత్యం (68) సోమవారం మధ్యా హ్నం 3 గంటల ప్రాంతంలో కిరాణా షాపు అరుగుపై కూర్చొ ని ఉండగా గజరాయనివలస ఊరి నుంచి ఆరిక తోటకు వెళు తున్న ఒడిశాకు చెందిన బోలేరో వాహనం ఢీకొంది. అదే ఊపు లో ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. దీంతో సత్యం అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆ స మయంలో సత్యంతో పాటు మరో ముగ్గురు అరుగుపై కూర్చొని ఉన్నారు. వారంతా త్రుటిలో ప్రాణా పాయం నుంచి బయట పడ్డారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.