అంగన్వాడీ న్యాయమైన సమస్యలు పరిష్కారించాలని అచ్యుతాపురంలో తాహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం కంచాలు వాయిస్తూ నిరసన తెలిపారు. అంగన్వాడీ ఉద్యోగ సంఘ నాయకులు ఎన్. వరలక్ష్మి మాట్లాడతూ సమ్మె ప్రారంభించి రెండు వారాలు అవుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం విచారకరమన్నారు. తమ డిమాండ్లు పరిష్కారం చేయాలని లేని పక్షంలో అంగన్వాడీ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు.