టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయు డు ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి తనవిజయానికి సహకరించాలని రాజాం నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జి కోండ్రు మురళీ మోహన్ కోరారు. సోమవారం ఒమ్మిలో టీడీపీ సీనియర్ నాయకుడు, పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు వంగా గోవిందరావును మురళీమోహన్ కలిసి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. తాను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నానని, తన కుమారుడు వెంకటరావు రెండుసార్లు సర్పంచ్‌గా ఎన్నికయ్యారని, తమ ఎంపీటీసీని కూడా గెలుపించుకున్నామని గోవిందరావు తెలిపారు.అనంతరం పురపాలక సంఘం పరిధిలోని కస్పావీధికి చెందిన టీడీపీ కార్యకర్త దొర ముఖలింగం ఇటీవల మృతిచెందడంతో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఒమ్మి సర్పంచ్ వంగా వెంకటరావు, రాజీయ్యపేట సర్పంచ్ రగమండల గణపతి నాయుడు, మాడుగుల జయరావు, గురవాన నారాయణరావు, టంకాల నాగరాజు, కె.రవి, మరిపి జగన్మోహన్రావు పాల్గొన్నారు.