మునిసిపల్ కార్మికులు సమ్మె సైరన్ మోగించారు. 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలోనూ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసెంబ్లీలోనూ జగన్ ఇచ్చిన హామీలు ఒక్కటి నెరవేర్చక పోవడంతో కార్మికులు ఆగ్రహంతో ఉన్నారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో అమీ తుమీ తేల్చుకుంటామని కార్మికులు నిరవధిక సమ్మెకు దిగుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మున్సిపల్ కార్మికుల సమస్యల న్నింటిని పరిష్కరిస్తామని జగన్ హామీ ఇచ్చా రు. గత నాలుగున్నరేళ్లుగా ఏ ఒక్క హామీ నెర వేర్చలేదు. సమస్యలు పరిష్కరించాలని కార్మి కులు మునిసిపల్ ఆఫీసుల ముందు ధర్నాలు, నిరాహార దీక్షలు, కలెక్టరేట్ వద్ద నిరసనలు, రిలే నిరాహార దీక్షలు, డీఎంఏ ఆఫీసు ముట్టడి ఇలా పలు రకాలుగా కార్మికులు ఆందోళనలు చేసినా ప్రభుత్వానికి చీమకుట్టిన్నట్టు లేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మునిసిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో సమ్మెకు వెళ్తున్నారు.
ఇవీ డిమాండ్లు
కాంట్రాక్టు అవుట్‌సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలి
సమాన పనికి సమాన వేతనం,కార్మికులకు రిస్క్, హెల్త్ అలవెన్సులు ఇవ్వాలి
క్లాప్ ఆటోడ్రైవర్లకు రూ.18500 కనీసవేతనాలు ఇవ్వాలి
రిటైర్మ్‌ంట్ బెనిఫిట్స్, గ్రాడ్యూటీ, సగం జీతం పింఛన్ ఇవ్వాలి
పర్మినెంట్ సిబ్బందికి సీపీఎస్ రద్దు చేయాలి
పాత పింఛన్ విధానం అమలు చేయాలి
విలీన పంచాయతీ కార్మికులకు ఆప్కాస్ నుంచి జీతాలు ఇవ్వాలి.