క్రీడల్లో యువత అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్రా స్పోర్ట్స్ టోర్నమెంట్ ను ప్రారంభించారని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి అన్నారు. ఈ మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గం 45వ వార్డు పరిధి కైలాసపురం డిఎల్ బి గ్రౌండ్స్ లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రా టోర్నమెంట్ ను మంగళవారం నార్త్ కన్వీనర్ కేకే రాజుతో కలిసి ప్రారంభించారు.