శ్రీకాకుళం నగరంలో విషాదం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్ళితే...... గార మండడానికి చెందిన ఓ మహిళ శ్రీకాకుళం నగరంలోని హయాతీనగరం సమీపంలో భర్తతో కలిసి నివసిస్తుంది. అయితే అదే ప్రాంతానికి చెందిన ఆకుల సురేష్.. తనతో మాట్లాడ డం లేదంటూ ఆమె ఇంటికి వెళ్లి దాడి చేశాడు. అంతటితో ఆగకుండా ఆమె భర్త పనిచేస్తున్న చికెన్కొట్టు యజమాని మధుతో కూడా గొడవపడ్డాడు. అడ్డుకునేందుకు వెళ్లిన ఆమె తల పట్టుకుని కారుకి గుద్దించాడు. దీంతో ఆమె గాయపడింది. దీంతో ఆమె వన్ టౌన్ పోలీసులకు ఆదివారం రాత్రి ఫిర్యాదు చేసింది. దీనిపై సీఐ సన్యాసినాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే దాడికి పాల్పడిన వ్యక్తిపై సస్పెక్ట్ షీట్ ఉన్నట్టు వన్ టౌన్ ఎస్ఐ బలివాడ గణేష్ తెలిపారు.