తాడేపల్లిలో మత్స్యకార కులాల ముఖ్య నేతల కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. రేపల్లె వైసీపీ ఇంఛార్జిగా మోపిదేవి వెంకటరమణని తప్పించటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేపల్లె వైసీపీ టికెట్ మోపిదేవి వెంకటరమణకు ఇవ్వాలని ఈ సమావేశంలో డిమాండ్ చేశారు. సమావేశానికి మత్స్యకార సామాజిక వర్గంలోని 14 ఉప కులాల నేతలు హాజరయ్యాయి. మోపిదేవిని రేపల్లె ఇంఛార్జిగా ప్రకటించి టికెట్ ఇవ్వాలని నేతలు పట్టుబట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa