దేశ రాజధానిలో చలి బెంబేలెత్తిస్తోంది. చలితీవ్రత పెరగడంతో రాజధాని వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు పొగమంచు దట్టంగా వ్యాపిస్తోంది. తద్వారా ఢిల్లీలోని సఫర్‌జంగ్‌లో 50 మీటర్లకు దృశ్యమానత పడిపోయింది. పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో పొగమంచు ఎక్కువగా వ్యాపిస్తున్నట్లు చూపించే ఉపగ్రహ చిత్రాన్ని కూడా వాతావరణ శాఖ విడుదల చేసింది. అమృత్‌సర్ విమానాశ్రయంలో విజిబిలిటీ 0కి పడిపోయింది.