ట్రెండింగ్
Epaper    English    தமிழ்

39 రోజుల్లో రూ.200 కోట్లు దాటిన శబరిమల ఆదాయం

national |  Suryaa Desk  | Published : Wed, Dec 27, 2023, 09:07 AM

కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి ఈసారి భక్తులు అధిక సంఖ్యలో కానుకలు సమర్పించారు. కేవలం 39 రోజుల్లో ఆలయ ఆదాయం రూ.200 కోట్లు దాటింది. ఈ నెల 25 వరకు రూ.204.30 కోట్ల ఆదాయం సమకూరినట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు(టీడీబీ) మంగళవారం తెలిపింది. ఇందులో భక్తులు సమర్పించిన కానుకల ద్వారా రూ.63.89 కోట్లు, అరవణ ప్రసాదం విక్రయంతో రూ.96.32 కోట్లు, అప్పం ప్రసాదం విక్రయం ద్వారా రూ.12.38 కోట్లు వచ్చినట్లు పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa