వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ..దేశంలో ఒక్క జగనన్న మాత్రమే ఏపీలో సామాజిక విప్లవానికి తెర తీశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల స్థితిగతులు పెరగాలని, కుటుంబాలు బాగుండాలని, మిగిలిన వారితో సమానంగా బతకాలనే ఉద్దేశంతో పాలన చేస్తున్న సీఎం జగనన్న.పేదవాడి పిల్లలు బాగా చదవాలని, ఉన్నత శిఖరాలకు వెళ్లాలని ఇంగ్లీషు మీడియం తెచ్చారు. కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. పేదవాడి పిల్లాడికి ఇంగ్లీషు మీడియం తెస్తే చంద్రబాబు కోర్టుకెళ్తాడు. రామోజీరావు మనవళ్లు, రాధాకృష్ణ చుట్టాలు ఇంగ్లీషు మీడియం చదవొచ్చు. ఎస్సీ, ఎస్టీల పిల్లలు చదవొద్దట. తెల్ల రేషన్ కార్డు ఉంటే ఏ రాష్ట్రంలోనైనా చూపించుకొనేలా రూ.25 లక్షల దాకా వైద్యం ఉచితంగా అందిస్తున్న జగనన్న.వైద్యం చేయించుకొని ఇంటికొచ్చాక ఖర్చులకు డబ్బులిస్తున్న సీఎం జగన్. చంద్రబాబు ఏనాడూ ఇలా చేయలేదు. పేదవారికి 31 లక్షల ఇంటి పట్టాలిచ్చి, ఇళ్లు కట్టిస్తున్న సీఎం జగననన్న.రూ.2.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తే 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యం ఇచ్చారు. అర్హత ఒక్కటే ప్రామాణికంగా పథకాలు ఇచ్చారు. ఉద్యోగాలిస్తానని పారిపోయిన చంద్రబాబు.రూ.4 లక్షల ఉద్యోగాలిస్తే 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చారు. మూలన ఉన్న కులాలకు వెతికి కార్పొరేషన్, డైరెక్టర్, ఎమ్మెల్యే, మేయర్ పదవులిచ్చిన జగనన్న. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు దళితుల మీద దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు, వెలివేతలు జరిగాయి. బీసీల తోకలు కత్తిరిస్తానన్న చంద్రబాబు. బీసీలు జడ్జిలుగా పనికి రారని ఉత్తరం రాసిన నీచుడు చంద్రబాబు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఆయనకు అవసరం లేదు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పేద వారికి అవసరం. భావితరాల భవిష్యత్ చూసే సీఎం దొరికాడు. కాపాడుకోవాల్సిన అవసరం మనకుంది అని పిలుపునిచ్చారు.