వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర మాట్లాడుతూ..ఏపీలో అందరి అవసరాలు తీర్చే పాలన, పేదల కష్టాలను గట్టెక్కించే పాలన చూస్తున్నాం. లంచాలు, రికమెండేషన్ లేకుండా నేరుగా మన ఖాతాల్లోకి పథకాల లబ్ధి వచ్చేలా చేశారు. త్యక్షంగా, పరోక్షంగా సుమారు రూ.5 లక్షల కోట్లకుపైగా అర్హత ఒక్కటే ప్రామాణికంగా అందించారు.గతంలో ఎవరూ చేయని విధంగా ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగనన్న.గత ప్రభుత్వంలో గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వలేదు. మన ముఖ్యమంత్రి జగనన్న ఇద్దరికి మంత్రిపదవులే కాదు, ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. గిరిజన సహకార సంస్థకు చైర్మన్ కూడా వేయని దద్దమ్మ ప్రభుత్వం గత ప్రభుత్వం. గిరిజనుల పేరుతో వారి కార్యకర్తలకు, నచ్చిన వారికి నిధులు దోచేశారు.14 సంవత్సరాలు సీఎంగా పని చేసిన చంద్రబాబు గిరిజనులకు ఇచ్చిన భూమి కేవలం 17 వేల మందికి 40 వేల ఎకరాలే. మన జగనన్న మనమీద ప్రేమతో 3 లక్షల ఎకరాలకుపైగా, 2 లక్షల మంది గిరిజనులకు భూములిచ్చారు. పోడు భూములకు రైతు భరోసా ఇచ్చిన నాయకుడు మన జగనన్న. 3.45 లక్షల మందికి రైతు భరోసా ఇస్తున్నారు. అమ్మ ఒడి, చేయూత, చేదోడు, జగనన్న తోడు, పింఛన్.. ఇన్ని పథకాలు ఎప్పుడైనా చూశామా? నవరత్నాలు లేకపోతే గిరిజన కుటుంబాలు ఆకలితో ఉండాలి. ఇప్పుడు ఒక్క కుటుంబం కూడా ఆకలితో లేరు.44 లక్షల మందికి అమ్మ ఒడి ఇస్తున్నారు. దేశంలో ఎక్కడా ఇలా ఇవ్వడం లేదు. 52 లక్షల మందికి వైయస్సార్ రైతు భరోసా, 25 లక్షల మందికి వైయస్సార్ చేయూత ఇస్తున్నారు. 79 లక్షల మందికి వైయస్సార్ ఆసరా, 31 లక్షల మందికి ఇంటి పట్టాలిచ్చారు. రూ.25 లక్షల దాకా ఆరోగ్యశ్రీ కింద వైద్యం ఉచితంగా ఇస్తున్నారు. గిరిజనులకు టీడీపీ 20 హామీలిచ్చింది. ఎన్ని హామీలు అమలు చేశారు? ఒక్క ఎకరం భూమి అయినా కొని ఇచ్చారా? ఎస్టీ కమిషన్ మీరు ఇచ్చారా? జగనన్న ఎస్టీ కమిషన్ ఇచ్చారు. రైతు రుణ మాఫీ, డ్వాక్రా రుణ మాఫీ చేస్తామని హామీలిచ్చి మోసం చేసిన చంద్రబాబు. 79 వేల మంది మహిళలను మోసం చేసిన పార్టీ టీడీపీ, దానికి తోడు పవన్ కల్యాణ్. వైయస్సార్ ఆసరా కింద ఇప్పటికే మూడు విడతలు ఇచ్చాం. మరో విడత జనవరిలో ఇస్తున్నాం. బాబొస్తాడు. జాబొస్తుందన్నారు. ఇంటికో ఉద్యోగం అన్నారు. ఇచ్చారా? జగనన్న 4 లక్షలకుపైగా ఉద్యోగాలిచ్చారు అని తెలిపారు.