వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా ప్రభుత్వ సలహాదారు, నటుడు ఆలీ మాట్లాడుతూ.. సీఎం వైయస్ జగన్‌ను ప్యాలెస్‌లో ఉన్న నాయకుడని చాలా మంది అంటారు. ఆయన రాజన్న బిడ్డ. పాదయాత్ర చేస్తున్నప్పుడు ప్రతి పేదవాడినీ కడుపు పట్టుకొని చూశాడు. ఆకలితో ఉన్నాడని గుర్తించాడు. మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పథకాలు తీసుకొచ్చారు. ఏమీ చేయలేదని కొందరు రాతలు రాస్తుంటారు. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అది ప్రజలకు తెలుసు. రాబోయే కాలంలో ఎంత డెవలప్‌మెంట్ జరుగుతుందనేది ప్రజలే నిర్ణయిస్తారు. పేద వాడి ఇంట్లో దేవుడి ఫొటో పక్కన వైయస్సార్ ఫొటో ఉంటుంది. మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో డబ్బున్న వ్యక్తి ఒక బెడ్డుపై పడుకుంటే పక్క బెడ్డుపై పడుకొని ఆపరేషన్ చేయించుకుంటున్న పేదవాడు. తండ్రి పెట్టిన ఆరోగ్యశ్రీని వైయస్ జగన్ కొనసాగిస్తున్నారు. పేదవాడికి గూడు ఉండాలనే ఆలోచన వైయస్ జగన్ గారికి రావడం ఆయన గొప్పతనానికి నిదర్శనం.రాష్ట్రంలో చాలా మందికి ఇంటి పట్టాలు దక్కాయి. 2024.. జగనన్న వన్స్ మోర్.. అని అన్నారు.