వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ..నియోజకవర్గంలో 1.28 లక్షల కుటుంబాల అభివృద్ధికి మన జగనన్న నేరుగా ఖాతాల్లో రూ.981 కోట్లు వేశారు. నాన్ డీబీటీ ద్వారా రూ.394 కోట్లు ఖర్చు చేశారు.ఇందులో బీసీలకు నేరుగా రూ.564 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.214 కోట్లు ఇచ్చారు.ఎస్సీలకు నేరుగా రూ.256 కోట్లు, నాన్ డీబీటీ కింద రూ.103 కోట్లు ఇచ్చారు.ఎస్టీలకు నేరుగా రూ.139 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.68 కోట్లు. మైనార్టీలకు నేరుగా రూ.22 కోట్లు, నాన్ డీబీటీ ద్వారా రూ.9 కోట్లు ఇచ్చారు. ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నాలుగున్నరేళ్లలో కనబడని వ్యక్తులు రకరకాల చొక్కాలు వేసుకొని దసరా వేషాలతో వస్తున్నారు. జగనన్న రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని అందరం కోరుకోవాలి. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టిన ప్రభుత్వాలు గతంలో లేవు. మిమ్మల్ని ఆదుకున్న జగనన్నను మీ బిడ్డగా ఆశీర్వదించండి. మరోసారి వైయస్ జగన్ ముఖ్యమంత్రి పీఠం అధిష్టించాలని, కొడవలూరు మండలం నార్తురాజుపాలెం గ్రామంలో 2024 జనవరి 20న శ్రీ నారికేళ సహిత రసలింగేశ్వర పాదరస మహా రుద్రాభిషేకం చేయిస్తున్నాం. లక్షా 108 కొబ్బరికాయలు కొడతాం. మీరంతా భాగస్వాములై ఒక్కో కొబ్బరికాయ కొట్టాలి. లక్ష రుద్రాక్షలతో అభిషేకం, లక్ష బిళ్వార్చనతో అభిషేకం, లక్ష కుంకుమార్చన చేస్తాం. అందరి ఆశీర్వాదం జగనన్నకు ఉండాలి అని అన్నారు.