రేపు వైఎస్ షర్మిల ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే షర్మిల భర్త అనిల్ కుమార్ ఢిల్లీకి చేరుకున్నారు. ఏ క్షణమైనా ఆమెకు ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చే అవకాశం ఉంది. రేపు అధికారికంగా కాంగ్రెస్‌లో షర్మిల చేరే అవకాశం ఉంది. ఏపీ పీసీసీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది. ముందుగా జాతీయ స్థాయిలో ఏఐసీసీలోనే సర్ధుబాటు చేయాలని షర్మిల విజ్ణప్తి చేసినట్లు సమాచారం. రేపు కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా షర్మిలను కాంగ్రెస్‌లో చేర్చుకునే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. నాగపూర్‌లో138వ కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలు జరగనున్నాయి. నాగపూర్‌లో భారీ బహిరంగ సభకు మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేశారు. బహిరంగ సభ వేదికకు ‘భారత్ జోడో మైదాన్’గా నామకరణం చేశారు. బహిరంగసభకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు సోనియా, రాహుల్, ప్రియాంక తదితర నేతలు హాజరుకానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa