ఏడు సార్లు విద్యుత్ రేట్లు పెంచి ప్రజలపై రూ.64 వేల కోట్లు భారం వేసిన చరిత్ర ఏపీ సీఎం జగన్‌దని తాడేపల్లిగూడెం టీడీపీ ఇన్చార్జ్ వలవల బాబ్జీ తెలిపారు. ఏడు సార్లు విద్యుత్ రేట్లు పెంచి ప్రజలపై 64 వేల కోట్లు భారం వేసిన చరిత్ర జగన్ దన్నారు. మద్యం మొత్తం నిషేధిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి , ఇప్పుడు దాని పేరుతో దోపిడీ చేస్తున్నారన్నారు. సీపీఎస్ రద్దు చేస్తానని ఉద్యోగస్తులను అధోగతి పాలు చేశారని వలవల బాబ్జీ అన్నారు. ఆశా వర్కర్లు, అంగన్వాడీ, మున్సిపల్ సిబ్బంది, వలంటర్లును నమ్మించి మోసం చెయ్యడంతో వారంతా రోడ్ల మీదకు వచ్చి ఆందోళనకు దిగుతున్నారన్నారు. చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వస్తున్నారన్నారు. వైసీపీ అంటే మునిగిపోయే నావ అని వలవల బాబ్జీ పేర్కొన్నారు.