టీటీడీ నిధులు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు విడుదల చేయడంపై హైకోర్ట్‌లో విచారణ జరిగింది. గతంలో నిధుల విడుదలను నిలిపి వేయాలని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. నిధుల విడుదలపై విధించిన స్టేను తొలగించాలని టీటీడీ, తిరుపతి కార్పొరేషన్ తరపు న్యాయవాదులు హైకోర్టును కోరగా ధర్మాసనం తోసిపుచ్చింది. గతంలో టీటీడీ నుంచి తిరుపతి మునిసిపాలిటీకి విడుదల అయిన నిధులు వివరాలను కోర్టు ముందుంచాలని ఆదేశాలు ఇచ్చింది. కౌంటర్ నిన్ననే దాఖలు చేయడంతో తమకు సమయం కావాలని పిటీషన్ తరపు న్యాయవాది బాలాజీ యలామంజుల కోరారు. దీంతో కేసు విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.