అంగన్వాడీల అక్రమ అరెస్టులు జగన్ నియంతృత్వానికి నిదర్శనమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. 15 రోజులుగా తమ న్యాయబద్దమైన డిమాండ్లపై పోరాడుతున్న అంగన్వాడీల సమస్యల పరిష్కారంపై వైసీపీ ప్రభుత్వం కొంచెం కూడా శ్రద్ధ పెట్టలేదన్నారు. వేతనాలు పెంపు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఉద్యోగ భద్రత వంటి పలు అంశాలను కోరుకున్న అంగన్వాడీలపై కర్కశత్వాన్ని ప్రదర్శించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీలపై జగన్ రెడ్డి ఉక్కుపాదం మోపడం నిరంకుశత్వమే అని టీడీపీ నేత అన్నారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతూ తమ డిమాండ్లపై ప్రజాప్రతినిధుల ఇళ్లకు వెళ్లి వినతిపత్రం ఇచ్చే స్వేచ్ఛ, స్వాతంత్ర్యం అంగన్వాడీలకు లేవా? అని ప్రశ్నించారు. విజయవాడ ధర్నాచౌక్‌లో నిరసన తెలిపేందుకు ఏర్పాటు చేసుకున్న శిబిరాన్ని అడ్డగోలుగా పీకేసి, అంగన్వాడీలను అక్రమంగా ఈడ్చుకుంటూ బస్సుల్లో పడేసి అరెస్టు చేయడం జగన్ నియంతృత్వానికి నిదర్శనమన్నారు. అంగన్వాడీ సోదరీమణుల న్యాయబద్ధమైన పోరాటానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అంగన్వాడీ సోదరీమణుల అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించాలని లోకేష్ డిమాండ్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa