తమిళ స్టార్ నటుడు, డీఎండీకే అధినేత కెప్టెన్ విజయకాంత్ గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా తమిళనాడు సిఎం ఎంకే స్టాలిన్ చెన్నైలోని విరుగంబాక్కంలోని నటుడి నివాసానికి చేరుకుని కెప్టెన్ భౌతికకాయంపై పూలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వ లాంఛనాలతో విజయకాంత్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా స్టాలిన్ వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa