నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 32వ డివిజన్ న్యూ ఎన్ సీసీ కాలనీలో గురువారం స్థానిక కార్పొరేటర్ అవినాష్ పర్యటించారు. స్థానిక సమస్యలు గురించి స్థానికులతో చర్చించారు వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ నాయకులు, అజీజ్, మంజూర్, ప్రసాద్, షమ్మీ, ఎన్ సీసీ కాలనీ స్థానికులు తదితరులు పాల్గొన్నారు.