జగన్ సర్కార్ విద్యుత్ వినియోగదారులపై ట్రూ అప్ చార్జెస్ పేరుతో అధికంగా బిల్లులు వసూలు చేస్తూ ప్రజల నడ్డి విరుస్తుందని భారతీయ జనతా పార్టీ నెల్లూరు సిటీ ఇంచార్జ్ మిడతల రమేష్ ఆరోపించారు. బుధవారం విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్లో బిజెపి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మడమ తిప్పను మాట తప్పనని వాగ్దానం చేసిన ముఖ్యమంత్రి విద్యుత్ చార్జీల పెంపు లో మాట తప్పారన్నారు.