ఎన్టిఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలంలో రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ ఇంటిని అంగన్వాడీలు గురువారం ముట్టడించారు. తమ సమస్యలపై మంత్రి స్పందించాలంటూ అంగన్వాడీలు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు మంత్రి ఇంటి వద్దకు భారీగా చేరుకున్నారు. అంగన్వాడీలను మంత్రి ఇంటి లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకున్నారు.