న్యాయస్థానాల పరిధిలో ఎదురవుతున్న ఇబ్బందుల వల్లే విశాఖపట్నం రాజధాని మార్పు ఆలస్యం అవుతోందని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈ సమస్యను అధిగమిస్తామని.. తప్పకుండా సీఎం జగన్ విశాఖ నుంచి పాలన సాగిస్తారని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం వైనాట్-175 లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. అసంతృప్తులు పార్టీని వీడడం మామూలుగా జరిగేదేనని వ్యాఖ్యానించారు.