చంద్రబాబు, పవన్ ఎన్ని కుతంత్రాలు పన్నినా మా నాయకులు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో తిరుగేలేదని వైయస్ఆర్‌సీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం వై నాట్-175 లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని.. అందుకే పార్టీలో మార్పులని పునరుద్ఘాటించారు. ఈ క్రమంలో అసంతృప్తులు పార్టీని వీడడం షరా మామూలుగా జరిగేదేనని అన్నారు. గురువారం విశాఖ ఎయిర్‌పోర్టులో మీడియాతో వంశీకృష్ణా యాదవ్ పార్టీ మారిన సంగతిపైనా వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఎక్కడైతే మార్పు అవసరమని భావించామో అక్కడే ఇన్‌చార్జ్‌లను మారుస్తున్నాం. ముందు పని చేసిన నాయకులు కొత్తవాళ్లకు సహకరించాలని సీఎం వైయస్ జగన్ కూడా చెప్పారు. ఎంతమంది ఉన్నా.. బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే పట్టుబట్టి వంశీకృష్ణ యాదవ్‌కు ఎమ్మెల్సీ ఇప్పించాం. ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన రాజీనామా చేసి వెళ్తున్నారంటే దానికి వారే సమాధానం చెప్పాలి. పార్టీ నుంచి ఎవరు వెళ్లినా మాకు ఇబ్బందేం లేదు అని అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు.. అభివృద్ధి కార్యక్రమాల కారణంగా ప్రజల ఆశీస్సులతో మళ్లీ వైయస్ జగనే సీఎం అవుతారు అని సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. న్యాయస్థానాల పరిధిలో ఎదురవుతున్న ఇబ్బందుల వల్లే విశాఖపట్నం రాజధాని మార్పు ఆలస్యం అవుతోందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఈ సమస్యను అధిగమిస్తామని.. తప్పకుండా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖ నుంచి పాలన సాగిస్తారని వైవీ సుబ్బారెడ్డి కుండబద్ధలు కొట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa