ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేనిఫెస్టో వైసీపీ అమలుచేయడం లేదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 28, 2023, 03:37 PM

తన మేనిఫెస్టో బైబిల్‌తో సమానమని చెప్పుకునే జగన్ రెడ్డి.. మేనిఫెస్టోలో చెప్పినవి ఎందుకు అమలు చేయలేదో ప్రజలకు చెప్పాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. టీడీపీ మేనిఫెస్టోను చంద్రబాబు ప్రజల ముందు ఉంచలేదనే జగన్ రెడ్డి, వైసీపీ నేతలు ఎన్నికల కమిషన్ వెబ్ సైట్లో చూస్తే కళ్లు బైర్లుకమ్ముతాయన్నారు. టీడీపీ మేనిఫెస్టో తళతళలాడుతున్న అద్దంలా ఎన్నికల కమిషన్ వెబ్ సైట్లో కనిపిస్తుందన్నారు. టీడీపీ మేనిఫెస్టోలోని హామీల్లో చంద్రబాబు 99 శాతం 2014-19 మధ్య అమలు చేశారనే వాస్తవం కూడా జగన్ రెడ్డి అతని ప్రభుత్వానికి బోధపడుతుందన్నారు. జగన్ రెడ్డి ఈ నాలుగున్నరేళ్లలో చేసిన అప్పులు, ప్రజల రక్తం పీల్చి వసూలుచేసింది కలిపి మొత్తం రూ.12 లక్షల కోట్లని, ఆ మొత్తంలో బటన్ నొక్కుడు ద్వారా ప్రజలకు అందించిన సాయం కేవలం రూ.2.40 లక్షల కోట్లు, మిగిలిన సొమ్ము ఎటుపోయిందో జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa