తమిళ స్టార్ నటుడు, డీఎండీకే నేత విజయ్ కాంత్ అంతిమ సంస్కారాలు శుక్రవారం ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. కాగా, తమ అభిమాన నేతకు అంతిమ వీడ్కోలు పలికేందుకు చెన్నైలోని పల్లవన్ సలాయ్ జంక్షన్ వద్దకు ప్రజలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. కాగా, చివరిసారిగా విజయ్ కాంత్ ను చూసేందుకు రాజకీయ, సినీ ప్రముఖులు వస్తున్నారు.