వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు విశేష ప్రజాదరణ లభిస్తోంది. నేడు అనంతపురంలో ఎమ్మెల్యే అనంతవెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగునుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు అనంతపురం ఆర్అండ్బీ అతిథి గృహంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మీడియా సమావేశం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు బస్సు యాత్ర ప్రారంభం కానుంది. అంబేద్కర్ విగ్రహం నుంచి పాతవూరు గాంధీ విగ్రహం వరకు బస్సు యాత్ర సాగనుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు చెన్నకేశవస్వామి ఆలయం ఎదురుగా బహిరంగ సభ నిర్వహించనున్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి ఉషాశ్రీచరణ్, మాజీ మంత్రి పేర్ని నాని, జూపూడి ప్రభాకర్, ఎంపీ తలారి రంగయ్య తదితరులు హాజరుకానున్నారు.