పెనమలూరులో గురువారం వైసీపీ సామాజిక సాధికారత యాత్ర ముగిసింది. వేలాది మంది జనసందోహం మధ్య ఉత్సాహంగా బస్సుయాత్ర జరిగింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ నేతల ప్రసంగాలు ప్రజల్లో ఉత్సాహాన్ని నింపాయి. జగనన్న అండతో తాము సాధించిన సాధికారతను నేతలు వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మేరుగ నాగార్జున, జోగి రమేష్, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యేలు కొలుసు పార్థసారథి, రక్షణ నిధి, హఫీజ్ ఖాన్, ఉదయభాను, కైలే అనిల్ కుమార్, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, పోతుల సునీత, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక తదితరులు పాల్గొన్నారు.