వైసీపీ చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.... జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పేదలకు మంచి జరగాలని అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ఈరోజు సామాజిక సాధికార యాత్ర లక్ష్యం ..ఈ నాలుగున్నరేళ్లలో బడుగు,బలహీన,మైనార్టీ వర్గాలకు జగనన్న వల్ల జరిగిన మేలును తలచుకోవడం. తెలుసుకోవడం. మన రాయచోటి నియోజకర్గానికే ఈ నాలుగున్నరేళ్లలో పథకాల కోసం, అభివృద్ధి పనుల కోసం రూ.1289 కోట్ల ప్రయోజనం కలిగించారు ముఖ్యమంత్రి. ఒక్క రాయచోటి నియోజకవర్గానికే డీబీటీ ద్వారా రూ.934 కోట్లు, నాన్ డీబీడీ కింద రూ.355 కోట్లు ఖర్చు చేశారు అని తెలిపారు.