పేదల కోసం సీఎం వైయస్ జగన్ ప్రతిక్షణం కష్ట పడుతున్నారని మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. అంతేకాకుండా.. మూడు వేలు పెన్షన్ అమలు చేస్తున్నామని అన్నారు. ఆసరా, చేయూత కార్యక్రమాల ద్వారా వెనుకబడిన వర్గాలకు మేలు చేస్తున్నామని మంత్రి మేరుగ చెప్పారు. జనవరి 19న విజయవాడలో చారిత్రాత్మక అంబేడ్కర్ విగ్రహాన్ని, మ్యూజియంను సీఎం ఆవిష్కరిస్తారన్నారు. మొక్క దగ్గర నుండి, ఇటుక రాయి వరకు ప్రతి అంశాన్ని సీఎం దగ్గర ఉండి ఈ విగ్రహాన్ని నిర్మించారని తెలిపారు. విగ్రహావిష్కరణ రోజు వేల సంఖ్యలో జనాలు ఈ కార్యక్రమానికి హాజరవుతారని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు.