వైసీపీ చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ..... దాదాపు నలభైఐదు రోజులుగా రాష్ట్రం నలుమూలలా సామాజికసాధికార యాత్ర జరుగుతోంది. స్వాతంత్య్రం వచ్చాక ఈ రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు అయ్యారు. బడుగు,బలహీన వర్గాలకు అంతో ఇంతో చేశారు. కానీ ఎవరూ ఊహించని రీతిలో బీసీ,ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు సామాజిక సాధికారత పేరిట రాజ్యాంగ పదవుల్లో కూర్చోపెట్టారు. బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు కేబినెట్‌లో పెద్దపీట వేశారు. రాజ్యాంగ పదవుల్లో ఎమ్మెల్యేలుగా, కార్పొరేషన్లలో మేయర్లుగా, మునిసిపల్ చైర్మన్‌లుగా కూర్చోబెట్టారు జగనన్న. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పేదలకు డీబీటీ ద్వారా దాదాపు రూ.2.4లక్షల కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేశారు జగనన్న.మన బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలు ఆత్మగౌరవంతో జీవించేలా చేశారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. అనేక సంక్షేమ పథకాలతో మన పేదల బతుకుల్లో వెలుగులు నింపారు ముఖ్యమంత్రి జగనన్న. ఇక ఇప్పుడు దేశంలోని.. ఏ రాష్ట్రంలో ఇవ్వని అత్యధిక పింఛన్లు అవ్వాతాతలకు అందించబోతున్నారు జగనన్న. ఇక ఆయన అందించే ప్రతి సంక్షేమ పధకం పేదల గడపల దగ్గరకే వస్తోంది. నగదు నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతోంది. ప్రేమించే మనసు, స్పందించే గుండె ఉన్న ప్రజానాయకుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు.