వైసీపీ చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.... నాలుగున్నరేళ్ల తర్వాత చెప్పినవన్నీ చేసి చూపించి సంబరాలు చేసుకుంటున్నాం. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కరివేపాకుగా వాడుకొని ఓటు బ్యాంకుగా చూసేవారు. జగనన్న వచ్చిన తర్వాత పేద పిల్లలకు ఉన్నత విద్య అందిస్తున్న గొప్ప ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాత్రమే. చంద్రబాబు డబ్బులు ఎలా సంపాదించాలి, కాంట్రాక్టర్ల నుంచి ఎలా దండుకోవాలని చూశారు. నాడు-నేడు ఆస్పత్రులు, స్కూళ్లు, అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, ట్యాబ్స్, ఐఎఫ్‌పీలు ఏర్పాటు చేశారు. కోటి రూపాయలైనా విదేశాల్లో చదివిస్తానంటున్నది జగనన్నమాత్రమే. పేదల పిల్లలకు ఇంగ్లీషు మీడియం తెచ్చిన ఏకైక సీఎం జగనన్న. ఆరోగ్యశ్రీతో వైద్యం అందిస్తున్నారు. మహిళా సాధికారత సాకారం చేశారు. ఇది హక్కు.. బిక్ష కాదు, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, ఉన్నతాధికారులు, నాయకులను మీ ఇంటికి పంపిస్తానన్న జగనన్న. లంచం, వివక్ష లేని వ్యవస్థను జగనన్న తయారు చేశారు. చంద్రబాబు 600 హామీలిచ్చి 6 హామీలైనా నెరవేర్చారా? జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి అక్కచెల్లెమ్మ, చిన్న పిల్లలు కూడా చెబుతారు. చంద్రబాబు మైనార్టీలకు మంత్రి పదవి లేదు. ఈరోజు జగనన్న హయాంలో నలుగురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు, డిప్యూటీ సీఎం మైనార్టీలకు ఇచ్చారు. మైనార్టీలకు వైయస్సార్ రిజర్వేషన్ ఇచ్చారు. జగనన్న ఫీజురీయింబర్స్‌మెంట్‌తో పాటు పథకాలు అందిస్తున్నారు. ఇంటి పట్టాలిచ్చారు. రూ.24 వేల కోట్లు మైనార్టీల కోసం వెచ్చించిన జగనన్న. జగనన్న లాంటి మంచి నాయకుడిని కాపాడుకుందాం. ఈ ప్రభుత్వం మనందరి గురించి ఆలోచించే ప్రభుత్వం అని అన్నారు.