వైసీపీ చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ..... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల స్థితిగతులు మార్చేందుకు జగనన్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓటు బ్యాంకుకే పరిమితమైన ఈ వర్గాలను సమాజంలో తలెత్తుకొని తిరిగేటట్టు చేస్తున్నారు. మనం అడగకుండానే యోగక్షేమాలు తెలుసుకొని స్థితిగతుల్లో మార్పులు తెచ్చిన జగనన్న. జాతీయ స్థాయిలో సంక్షేమ రథ సారథిగా జగనన్న గుర్తింపు పొందారు. రూ.2.50 లక్షల కోట్లు నేరుగా ఎక్కడా రూపాయి లంచం లేకుండా అందించారు. విప్లవాత్మక మార్పులు, చారిత్రాత్మక నిర్ణయాల ద్వారా ప్రజారంజక పాలన అందిస్తున్నారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో అనైతిక పొత్తులతో రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు, పవన్ వస్తున్నారు. నాలుగున్నరేళ్లలో మన ఆర్థిక స్థితిగతుల్లో మార్పులు తెచ్చేందుకు జగనన్న ప్రయత్నించారు. జగనన్న నాయకత్వానికి మనందరు అండగా ఉండాలి అని అన్నారు.