ప్రైవేటీకరణ పేరుతో విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర మంత్రిత్వ శాఖ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని సీపీఐ నేత రామకృష్ణ ప్రధాని మోదీకి శుక్రవారం లేఖ రాశారు. స్టీల్‌ప్లాంట్ భూములు అదానీ కంపెనీకి అక్రమంగా అప్పగించేందుకు ఒత్తిడి తేవడం దుర్మార్గమని లేఖలో పేర్కొన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగిస్తూ ఫ్యాక్టరీ పురోభివృద్ధికి చర్యలు చేపట్టాలని రామకృష్ణ ప్రధానిని కోరారు.