కంబదూరు మండలం జెల్లిపల్లిలో నిర్మాణంలో ఉన్న శివాలయం, ధ్వజ స్థంభం నిర్మాణానికి శుక్రవారం కళ్యాణదుర్గం టీడీపీ ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు రూ. 2లక్షల నగదు సాయాన్న గ్రామస్తులకు అందజేశారు. గ్రామస్థులు అందరూ కలిసి శివాలయానికి ఆర్థిక సాయాన్ని అందజేయాలని ఉమామహేశ్వర నాయుడును కోరారు. దీంతో ఇచ్చిన మాట ప్రకారం ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు స్వగృహంలో జెల్లిపల్లి వాసులకు ఆర్థిక సాయాన్ని అందించారు.