అల్లూరి జిల్లా అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గొన ఆధ్వర్యంలో హుకుంపేటలో సామజిక సాధికార బస్సుయాత్ర జరగనుంది. ఉదయం 11 గంటలకు బర్మన్ గూడలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం బర్మన్ గూడా నుంచి హుకుంపేట వరకు భారీ బైక్ ర్యాలీ సాగనుంది. అనంతరం హుకుంపేట కస్తూరిబా పాఠశాలలో నాడు- నేడు పనులను మంత్రులు పరిశీలించనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు హుకుంపేటలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మంత్రులు రాజన్న దొర, మేరుగు నాగార్జున, ఇంచార్జ్ మంత్రి గుడివాడ అమర్నాథ్, డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, సీదిరి అప్పలరాజు తదితరులు హాజరుకానున్నారు.