రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్లు కట్టిస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడైనా ఉన్నారా? అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. అసలు చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్క పథకమైనా ఉందా? అని ఆయన నిలదీశారు. తెలుగుదేశం పార్టీకి తెగులు పట్టిందని మంత్రి మండిపడ్డారు. టీడీపీ దివాళా తీసిందని అందరికీ తెలుసన్నారు. చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసే దమ్ము, ధైర్యం లేదనీ తెలుసని ఎద్దేవా చేశారు. పొత్తుల పేరుతో అందరి కాళ్లు పట్టుకుంటూ చంద్రబాబు తిరుగుతున్నారని దుయ్యబట్టారు. అలాంటి పార్టీకి చెందిన అచ్చెన్నాయుడు వైయస్ఆర్సీపీ మేనిఫెస్టో ఫెయిల్ అయిందని ఆరోపించటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.