వైసీపీ చేపట్టిన సామజిక సాధికార యాత్రలో భాగంగా ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ.... అట్టడుగున ఉన్న అణగారిన వర్గాలు, పేదరికంలో మగ్గిపోతున్న వారికి ప్రత్యేకంగా కార్యక్రమాలను చిత్తశుద్ధితో అమలు చేసిన సందర్భాలు గతంలో లేవు. మన హక్కుల్ని కాపాడుకోలేని వారిని కాపాడటం ప్రభుత్వ బాధ్యత. దేశ సంపద, అవకాశాలు, వనరులను అందరికీ సమానంగా పంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలమీద ఉంది. దేశంలో మొట్టమొదటి సారి పేదలకు సంపద పంచే ఆలోచన వైయస్సార్ చేశారు. పేదవాడి బిడ్డ కష్టపడి చదివి ఇంజనీరింగ్ సీటు సంపాదిస్తే తల్లిదండ్రులు ఫీజులకు భయపడేవారు. నేను చదివిస్తాను, ఏం కావాలంటే అది చదవాలంటూ ఫీజు రీయింబర్స్ మెంట్ ప్రారంభించిన వైయస్సార్. అది సామాజిక న్యాయం. నాన్న రెండు అడుగులేస్తే నేను నాలుగు అడుగులు వేస్తానన్న జగనన్న. ఆరోగ్యశ్రీలో నాడు వెయ్యి జబ్బులు ఉంటే నేడు మూడున్నర వేల జబ్బులను చేర్చిన సీఎం జగన్. కరోనాని ఎదుర్కోవడంలో ఏపీ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా పని చేసిందని ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. నియోజకవర్గంలో పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పంచే అవకాశం నాకు దక్కింది. కాలువ కట్టల మీద ఇళ్లు పీకేస్తారని ప్రజలు భయాందోళనలకు గురైతే వారికి విద్యుత్, తాగునీటి వసతి కల్పించి భరోసా ఇచ్చాం. పేదవాడికి జీవితం మీద భరోసా కల్పించడం కూడా అభివృద్ధే. నియోజకవర్గంలో రూ.1,763 కోట్లు ఆర్థిక సాయం అందింది. 75 శాతం రోడ్లను నిర్మించుకున్నాం. కంకిపాడులో గొడవర్రు రోడ్డు, మెయిన్ రోడ్డు వేయించిన ఘనత మనదే. బీజేఆర్ నగర్‌లో ఎస్సీ కాలనీకి రోడ్డు ప్రారంభించాం. సొంత నిధులు ఖర్చుపెట్టి రోడ్డు పూర్తి చేశాం. ముస్లింలకు 3 షాదీఖానాలు నిర్మించాం. ఉయ్యూరులో ఏసీ షాదీఖానా నిర్మించాం అని వివరించారు.