అనంతపురం జిల్లాలో ఇంకొక్కరికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య మూడుకు చేరింది. అనంతపురంలోని లక్ష్మీనగర్‌కు చెందిన 55 ఏళ్ల వ్యక్తికి, కళ్యాణదుర్గానికి చెందిన 64 ఏళ్ల వృద్ధురాలికి బుధవారం కొవిడ్ నిర్ధారణ అయ్యింది. లక్ష్మీనగర్‌కు చెందిన వ్యక్తి జిల్లా ఆస్పత్రి కొవిడ్ వార్డులో చికిత్స పొందుతున్నారు. కళ్యాణదుర్గం వృద్ధురాలు హోం ఐసొలేషనలో ఉన్నారు. వీరిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని, కొవిడ్ లక్షణాలు ప్రమాదకరంగా లేవని డీఎంహెచఓ డాక్టర్ ఈబీ దేవి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ రెండు కుటుంబాలను వైద్య సిబ్బంది పర్యవేక్షిస్తున్నారని, వారి కుటుంబ సభ్యులకు కొవిడ్ లక్షణాలు లేవని డీఎంహెచఓ తెలిపారు.