జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన పర్యటనలో భాగంగా కాకినాడ నగరంపైనే ఎక్కువగా దృష్టి సారించారు. గురువారం రాత్రి వరకు జరిగిన నియోజకవర్గాల సమీక్షలో కాకినాడ సిటీపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. 50 డివిజన్ల నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. డివిజన్ స్థాయిలో సైతం నేతల పనితీరుపై సమీక్ష చేస్తున్నారు. కమిటీలు వేయకపోవడంపై నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కూడా పవన్ కల్యాణ్ కాకినాడ సిటీపైనే సమీక్ష చేయనున్నారు. కాగా కాకినాడ నుంచి అసెంబ్లీకి పవన్ పోటీ చేస్తారనే ప్రచారానికి తాజా సమీక్షతో మరింత బలం చేకూరింది. ఇక్కడున్న వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తానంటూ పవన్ ఇప్పటికే వారాహి యాత్రలో వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే.