సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టారు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ధర్నాలో పాల్గొని తన సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఉద్యోగులకు ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.