ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మగౌరవంగా భాసిల్లుతున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను విరమించాలన్నారు. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. 3వ బ్లాస్ట్ ఫర్నేష్‌ను జిందాల్ కంపెనీకి అప్పగించటం తగదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను ఆదానీ కంపెనీకి అక్రమంగా అప్పగించేందుకు ఉక్కు మంత్రిత్వ శాఖ ఒత్తిడి తేవటం దుర్మార్గమని రామకృష్ణ అన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగిస్తూ ఫ్యాక్టరీ పురోభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు. స్టీల్ ప్లాంట్‌కు అవసరమైన క్యాప్టివ్ ఐరన్ ఓర్ గని కేటాయించేందుకు చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.