ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అభివృద్ధి పనుల విషయమే సీఎం ని కలిసాను

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 29, 2023, 02:43 PM

మైలవరం ఎమ్మెల్యే సీటు విషయంలో సీఎం జగన్ నిర్ణయమే శిరోధార్యమని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. 2019లో జగన్ చెబితేనే మైలవరంలో పోటీ చేసి..1999లో తనను ఓడించిన వ్యక్తిని మైలవరంలో ఓడించానన్నారు. నిన్న సీఎంఓ నుంచి ఫోన్ వచ్చిందని వెళ్లానన్నారు. అభివృద్ధి పనుల నిధుల కోసమే సీఎంను కలవడం జరిగిందన్నారు. ఎవరు ప్రయత్నాలు వారు చేసుకున్నా తన నియోజకవర్గంలో మాత్రం తన పని తనను చేసుకోమని జగన్ చెప్పారన్నారు. చిన్న విషయాలు పట్టించుకోవద్దు, స్పందించవద్దని సీఎం చెప్పారన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం మాత్రమే జగన్‌ను కలిశానన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com