టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ఆర్ అండ్ బీ అతిధి గృహం వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు శాంతిపురం మండల కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద భాహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 3 గంటలకు రామకుప్పంకు చేరుకుని పోలీస్ స్టేషన్ సర్కిల్‌లో సభలో పాల్గొని ప్రసంగిస్తారు. 5గంటలకు కుప్పం బైపాస్ రోడ్డులోని ఎంఎం మహల్‌కు చేరుకొని జనసేన శ్రేణులతో ఇంటరాక్ట్ అవుతారు. 6 గంటలకు బీసీఎన్ కల్యాణ మండపంలో టీడీపీ నాయకులతో సమీక్ష నిర్వహిస్తారు. రాత్రికి ఆర్ అండ్ బీ అతిథి గృహంలో బస చేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa