టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, సీఎం జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. అయన మాట్లాడుతూ..... మాయమాటలు చెప్పి జగన్ అధికారంలోకి వచ్చాడన్నారు. 99.5 శాతం హామీలు పూర్తి చేశామని వైసీపీ నాయకులు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణ చేస్తున్నా ఆపే ప్రయత్నం చేయలేదన్నారు. ల్యాండు శాండు దోచుకున్నారని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.