గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలిచ్చింది. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ బాధ్యతను చూసుకోవాలని, పిల్లలకు పోషకాహారం అందించాలని ఆదేశించింది.
అంగన్వాడీలు సమ్మె చేస్తోన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక పట్టణాల్లో మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగడంతో.. ఇతర కూలీలతో పనులు చేయించాలని వార్డు కార్యదర్శులను సర్కార్ ఆదేశించింది. ఉ. 5.30 గంటలకే విధుల్లో చేరాలని పేర్కొంది.