ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. 122 క్షిపణులు, 36 డ్రోన్లతో ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా ప్రధాన నగరాలపై దాడి చేసింది. ఈ దాడుల్లో 27 మంది పౌరులు మృతి చెందగా.. 144 మంది గాయపడ్డారు.
శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. 22 నెలలుగా కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌పై జరిగిన అతి పెద్ద గగనతలదాడి ఇదేనని ఆ దేశ ప్రభుత్వం పేర్కొంది. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ట్విట్టర్‌లో స్పందించారు.