ఒక గ్రహ వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ (CO2) పాళ్లు తక్కువగా ఉంటే అక్కడ నీరు, జీవం ఉండే అవకాశాలు ఎక్కువని అమెరికాలోని ఎంఐటీ, బ్రిటన్‌లోని బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు కనుగొన్నారు.
కార్బన్ డైఆక్సైడ్ తక్కువగా ఉండే గ్రహాలు జీవ నివాసయోగ్యమైనవి అవుతాయి. సాధారణంగా ప్రతి నక్షత్రం చుట్టూ గ్రహాలు ఏర్పడతాయి. కానీ అన్ని రకాల గ్రహాలు జీవులకు నివాస యోగ్యం కావు.