ఉరవకొండ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వర రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శుక్రవారం తిరుమల చేరుకున్న మాజీ ఎమ్మెల్యే ఆయన సతీమణి భువనేశ్వరి, వారి కుమారుడు వై. ప్రణయ్ రెడ్డి శనివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వరస్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ వేద పండితులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు.